Peter Constantine is a literary translator and editor, and the director of the Literary Translation Program at the University of Connecticut. His translations include essential writings of Rousseau and Machiavelli, works by Tolstoy, Gogol and Voltaire, and the complete works of Isaac Babel, which received the Koret Jewish Literature Award. Born in London and raised in Athens, he translates from German, Russian, French, Modern and Ancient Greek, Italian, Albanian, Dutch and Slovene. A Guggenheim Fellow, he won the PEN Translation Prize for Six Early Stories by Thomas Mann and the National Translation Award for The Undiscovered Chekhov. His debut novel, The Purchased Bride, draws on his grandmother's life in the final years of the Ottoman Empire.
పీటర్ కాన్స్టాంటైన్ ఒక ప్రముఖ సాహిత్య అనువాదకుడు, సంపాదకుడు, యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్ (University of Connecticut) లో 'లిటరరీ ట్రాన్స్లేషన్ ప్రోగ్రామ్' డైరెక్టర్. ఆయన చేసిన అనువాదాలలో రూసో,మాకియవెల్లిల ముఖ్యమైన రచనలు, అలాగే టాల్స్టాయ్, గోగోల్, వోల్టేర్ల గ్రంథాలూ ఉన్నాయి. ఆయన అనువదించిన ఐజాక్ బాబెల్ సమగ్ర రచనల సంకలనానికి ప్రతిష్టాత్మక 'కోరెట్ జ్యూయిష్ లిటరేచర్ అవార్డు' లభించింది.లండన్లో జన్మించి, ఎథెన్స్లో పెరిగిన పీటర్.. జర్మన్, రష్యన్, ఫ్రెంచ్, ఆధునిక, పురాతన గ్రీక్, ఇటాలియన్, అల్బేనియన్, డచ్, స్లోవేన్ భాషల నుండి అనువాదాలు చేస్తారు. గగ్గెన్హీమ్ ఫెలో అయిన ఆయన, థామస్ మన్ రాసిన 'సిక్స్ ఎర్లీ స్టోరీస్' అనువాదానికి 'పెన్ (PEN) ట్రాన్స్లేషన్ ప్రైజ్' మరియు 'ది అన్డిస్కవర్డ్ చెకోవ్' అనువాదానికి 'నేషనల్ ట్రాన్స్లేషన్ అవార్డు' గెలుచుకున్నారు. ఒట్టోమన్ సామ్రాజ్యపు చివరి రోజులలో తన నానమ్మ జీవిత విశేషాల ఆధారంగా రాసిన 'ది పర్చేజ్డ్ బ్రైడ్' (The Purchased Bride) ఆయన తొలి నవల.