Jeyamohan is one of the most prolific and influential writers in contemporary Tamil literature, writing in both Tamil and Malayalam. Born in 1962 in Kanyakumari district, he is known for novels such as Rubber, Vishnupuram and Kaadu, and for Venmurasu, a monumental retelling of the Mahabharata across 26 volumes. He has also written for Tamil and Malayalam cinema, including Naan Kadavul, Angadi Theru and Ponniyin Selvan. Chaaya Publications has brought his work to Telugu readers through Nemmi Neelam, Adholokam and Tella Enugu. HBT has published his "Madan Moksham."
జయమోహన్, సమకాలీన తమిళ సాహిత్యంలో అత్యంత ప్రతిభావంతమైన, ప్రభావవంతమైన రచయితలలో ఒకరు. తమిళం, మలయాళం రెండు భాషల్లోనూ రచనలుచేసే ఆయన 1962లో కన్యాకుమారి జిల్లాలో జన్మించారు. రబ్బర్, విష్ణుపురం, కాడు వంటి ప్రసిద్ధ నవలలతో పాటు, మహాభారతాన్ని 26 సంపుటాలుగా (Volumes) సుదీర్ఘంగా పునర్లిఖించిన మహాకావ్యం 'వెణ్మురసు' ద్వారా విశేష గుర్తింపు పొందారు. జయమోహన్ గారు తమిళ, మలయాళ సినిమా రంగాలలో కూడా కథా/మాటల రచయితగా పనిచేస్తున్నారు. వాటిలో నాన్ కడవుల్, అంగడి తెరు, 'పొన్నియిన్ సెల్వన్' వంటి సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. 'ఛాయా పబ్లికేషన్స్' ఆయన రచనలను 'నెమ్మి నీలం', 'అధోలోకం', 'తెల్ల ఏనుగు' పుస్తకాల రూపంలో తెలుగు పాఠకులకు అందించింది. 'మాడన్ మోక్షం' హెచ్.బి.టీ ప్రచురించింది.