Sri Uha S. is a Telugu author and social impact professional whose writing draws on the lived experiences of women, communities and people at the margins. Rooted in Telangana's social and cultural landscape, her work explores identity, relationships, women's lives and social change across rural and urban communities. She is the author of three Telugu short story collections, Isuka Addam, Balkaav and Sikka, which address women's experiences, child marriage, social inequalities and the evolving relationship between tradition and contemporary aspirations. Her interests also extend to Telangana's history, folk traditions, arts and heritage. She is currently Director at WE Hub, Government of Telangana, where her work spans entrepreneurship, social inclusion, grassroots innovation and women-led enterprise development.
శ్రీ ఊహ ఎస్. తెలుగు రచయిత్రి, సామాజిక ప్రభావ రంగ నిపుణురాలు. మహిళలు, సముదాయాలు, అంచులకు నెట్టబడిన ప్రజల జీవితానుభవాల నుంచి ఆమె రచన పుడుతుంది. తెలంగాణ సామాజిక, సాంస్కృతిక నేపథ్యంలో వేళ్లూనుకున్న ఆమె రచనలు, గ్రామీణ, పట్టణ సముదాయాల్లో అస్తిత్వం, సంబంధాలు, స్త్రీల జీవితాలు, సామాజిక మార్పును అన్వేషిస్తాయి. ‘ఇసుక అద్దం’, ‘బాల్కావ్’, ‘సిక్క’ అనే మూడు కథా సంపుటాలు రాశారు; స్త్రీల అనుభవాలు, బాల్యవివాహాలు, సామాజిక అసమానతలు, సంప్రదాయానికీ సమకాలీన ఆకాంక్షలకూ మధ్య మారుతున్న సంబంధం ఆమె కథల్లో కనిపిస్తాయి. తెలంగాణ చరిత్ర, జానపద సంప్రదాయాలు, కళలు, వారసత్వంపై కూడా ఆమెకు ఆసక్తి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ ‘వి-హబ్’ (WE Hub) డైరెక్టర్గా ఉన్న ఆమె పని పారిశ్రామికత, సామాజిక సమ్మిళితత్వం, అట్టడుగు స్థాయి ఆవిష్కరణలు, మహిళల నేతృత్వంలోని సంస్థల అభివృద్ధి రంగాల్లో సాగుతోంది.