Swarna Kilari is a Telugu writer and translator, born in Kothagudem in the erstwhile Khammam district and now based in Hyderabad. Her Telugu translation of Ammu Nair's A Brief Hour of Beauty, titled Liptakalapu Swapnam, won the Telugu University Translation Award. She also translated Benyamin's Malayalam novel Aadujeevitham into Telugu as Meka Batuku, working from Joseph Koyippally's English translation, Goat Days, and Sitesh Alok's No Stopping as Ika Edureledu. She co-authored 13 – Padamudu, the Telugu account of the Thai boys' football team rescue, and edited Intiyanam and Intiyanam 2.0, anthologies of travel narratives by a hundred women. Her story collections are Nalla Bangaram (2024) and Godavatala (2025).
స్వర్ణ కిలారి రచయిత్రి, అనువాదకులు. పూర్వ ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో జన్మించిన ఆమె ప్రస్తుతం హైదరాబాదులో నివసిస్తున్నారు. అమ్మూ నాయర్ ఇంగ్లీషు పుస్తకం ‘ఏ బ్రీఫ్ అవర్ ఆఫ్ బ్యూటీ’ని ‘లిప్తకాలపు స్వప్నం’ పేరుతో అనువదించి, ప్రతిష్ఠాత్మక తెలుగు విశ్వవిద్యాలయం అనువాద పురస్కారం అందుకున్నారు. బెన్యామిన్ మలయాళ నవల ‘ఆడుజీవితం’ను జోసెఫ్ కోయిపల్లి ఇంగ్లీషులో ‘గోట్ డేస్’గా రాయగా, స్వర్ణ దానిని ‘మేక బతుకు’ పేరుతో తెలుగులోకి అనువదించారు. సితేష్ అలోక్ ఆంగ్ల రచన ‘నో స్టాపింగ్’ను ‘ఇక ఎదురేలేదు’ పేరుతో అనువదించారు. థాయ్లాండ్ బాలుర ఫుట్బాల్ జట్టు రెస్క్యూ ఆపరేషన్ కథతో తెలుగులో వచ్చిన ‘13 – పదమూడు’ పుస్తకానికి సహ రచయిత్రి. వంద మంది స్త్రీల యాత్రా కథనాల సంకలనాలు ‘ఇంతియానం’, ‘ఇంతియానం 2.0’కు సంపాదకురాలు. ‘నల్ల బంగారం’ (2024), ‘గోడవతల’ (2025) కథా సంపుటాలు వెలువరించారు.