<< Back to All Speakers

Lakshmana Chakravarthy is a Telugu literary critic, scholar, translator and editor, and Assistant Professor in the Department of Telugu Studies at Telangana University. Born in 1976 in Gummadidala, near Narsapur in Medak district, he completed his MA and PhD at Osmania University and his MPhil at the Central University. He taught Telugu for 14 years at Andhra Vidyalaya College, Hyderabad. His critical essay collections include Vyasachakram, Lakshmanarekha, Kavitvanusandhanam, Pratibimbam, Navyasampradaya Sahityam, Kovela Sampatkumara Charya and Pracheena Telugu Sankalanalu, his doctoral thesis. He has edited Adhunika Sahitya Vimarsa Reetulu, Adhunika Sahitya Vimarsakulu – Prasthanalu and Telugu Sahitya Vimarsa Darshanam, and translated the Tamil novel Kaval Kottai into Telugu as Kavali Kota for the Sahitya Akademi. His honours include the Telugu University Literary Criticism Award (2010), the Kolakaluri Bhagirathamma Literary Criticism Award, the Sahridaya Literary Criticism Award (2016) and the Maharshi Badarayana Vyas Samman (2016).


లక్ష్మణ చక్రవర్తి ప్రముఖ తెలుగు సాహిత్య విమర్శకులు, పరిశోధకులు, అనువాదకులు, సంపాదకులు. ప్రస్తుతం తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 1976లో మెదక్ జిల్లా నర్సాపూర్ సమీపంలోని గుమ్మడిదలలో జన్మించిన ఆయన, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ., పీహెచ్‌డీ, సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఎం.ఫిల్. పూర్తిచేశారు. హైదరాబాద్ ఆంధ్ర విద్యాలయ కళాశాలలో 14 ఏళ్లపాటు తెలుగు అధ్యాపకులుగా పనిచేశారు. ‘వ్యాసచక్రం’, ‘లక్ష్మణరేఖ’, ‘కవిత్వానుసంధానం’, ‘ప్రతిబింబం’, ‘నవ్యసంప్రదాయ సాహిత్యం’, ‘కోవెల సంపత్కుమారాచార్య’ వంటి విమర్శ వ్యాస సంపుటాలతో పాటు, తన పీహెచ్‌డీ సిద్ధాంత గ్రంథం ‘ప్రాచీన తెలుగు సంకలనాలు’ను వెలువరించారు. ‘ఆధునిక సాహిత్య విమర్శ రీతులు’, ‘ఆధునిక సాహిత్య విమర్శకులు – ప్రస్థానాలు’, ‘తెలుగు సాహిత్య విమర్శ దర్శనం’ గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. తమిళ నవల ‘కావల్ కోట్టై’ని ‘కావలి కోట’ పేరుతో సాహిత్య అకాడమీ కోసం తెలుగులోకి అనువదించారు. తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య విమర్శ పురస్కారం (2010), కొలకలూరి భగీరథమ్మ సాహిత్య విమర్శ పురస్కారం, సహృదయ సాహిత్య విమర్శ పురస్కారం (2016), మహర్షి బాదరాయణ వ్యాస్ సమ్మాన్ (2016) సహా ఎన్నో గౌరవాలు అందుకున్నారు.