<< Back to All Speakers

Sudhakar Unudurti is a Hyderabad-based Telugu short story writer and novelist known for historical fiction. Born in 1954 in Visakhapatnam, he worked as a marine engineer in the merchant navy and began writing after retirement. His work draws on maritime history, India's colonial past and the imprint of Buddhism on the Kalinga-Andhra coast. His story collection Toorupu Gaalulu (2018) won the Singamaneni Award, and his novels Yaaraada Konda and Chedarina Paadamudralu won American Telugu Association (ATA) prizes in 2020 and 2024. He co-authored Tathaagatuni Adugujaadalu (2019), on Buddhist sites around Visakhapatnam. His stories have been translated into English as East Wind (2023), into Kannada as Moodana Maarutha (2025), and into Tamil. His recent books are the story collection Arakappu Allam Tea and Uppugaali Kaburlu, an account of his years at sea.


ఉణుదుర్తి సుధాకర్ చారిత్రక కాల్పనిక రచనలకు పేరొందిన తెలుగు కథకుడు, నవలా రచయిత. 1954లో విశాఖపట్నంలో జన్మించిన ఆయన ప్రస్తుతం హైదరాబాదులో నివసిస్తున్నారు. వృత్తిరీత్యా మెరైన్ ఇంజినీరుగా పనిచేసి, పదవీ విరమణ తర్వాత రచనా వ్యాసంగం మొదలుపెట్టారు. సముద్రయాన చరిత్ర, వలస పాలనలోని భారతదేశం, కళింగాంధ్ర తీరంపై బౌద్ధమత ప్రభావం ఆయన రచనలకు ప్రధాన భూమిక. 2018లో వెలువడిన కథా సంపుటి ‘తూరుపు గాలులు’ సింగమనేని పురస్కారం పొందింది; ‘చలిచీమల కవాతు’ (2021) ఆయన రెండవ కథా సంపుటి. తొలి నవల ‘యారాడకొండ’ (2020), రెండవ నవల ‘చెదరిన పాదముద్రలు’ (2024) అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) పోటీలో బహుమతులు గెలుచుకున్నాయి. విశాఖ పరిసరాల్లోని బౌద్ధ క్షేత్రాలపై ‘తథాగతుని అడుగుజాడలు’ (2019) గ్రంథానికి సహరచయిత. ఆయన కథలు ఇంగ్లీషులో ‘ఈస్ట్ విండ్’ (2023)గా, కన్నడలో ‘మూడణ మారుత’ (2025)గా, తమిళంలోనూ అనువాదమయ్యాయి. మూడవ కథా సంపుటి ‘అరకప్పు అల్లం టీ’, సముద్రయాన అనుభవాల ‘ఉప్పుగాలి కబుర్లు’ ఆయన ఇటీవలి పుస్తకాలు.