<< Back to All Speakers

Gunturu Lakshmi Narasaiah is a Telugu poet, critic, editor and columnist, and a key voice of the Dalit literary movement in Telugu. A retired lecturer in English based in Vijayawada, he edited the landmark anthologies Chikkanavutunna Pata (1994) and Padunekkina Pata (1996), which brought nearly a hundred Dalit, Bahujan and minority poets together for the first time. His critical works, including Dalitha Sahityam – Tatvika Drukpatham, The Essence of Dalit Poetry, Kavitva Nirmana Paddhatulu and Samajika Kala Vimarsha, read Telugu Dalit poetry through an Ambedkarite lens. Kavitvam – Charchaneeyamshaalu (2021) was shortlisted for the Sahitya Akademi Award two years in a row. His honours include the Andhra Pradesh State Literary Award (2024), two Telugu University awards and the Mahakavi Gurram Jashuva Award.


గుంటూరు లక్ష్మీనరసయ్య ప్రముఖ తెలుగు కవి, విమర్శకుడు, సంపాదకుడు, కాలమిస్ట్; తెలుగు దళిత సాహిత్య ఉద్యమంలో కీలకమైన గొంతుకల్లో ఒకరు. విజయవాడలో నివసిస్తున్న ఆయన విశ్రాంత ఆంగ్ల అధ్యాపకులు. ఆయన సంపాదకత్వంలో వెలువడిన ‘చిక్కనవుతున్న పాట’ (1994), ‘పదునెక్కిన పాట’ (1996) సంకలనాలు దళిత, బహుజన, మైనారిటీ వర్గాలకు చెందిన దాదాపు వంద మంది కవులను తొలిసారి ఒకే వేదికపైకి తెచ్చి, తెలుగు సాహిత్యంలో మైలురాళ్లుగా నిలిచాయి. ‘దళిత సాహిత్యం – తాత్విక దృక్పథం’, ‘The Essence of Dalit Poetry’, ‘కవిత్వ నిర్మాణ పద్ధతులు’, ‘సామాజిక కళా విమర్శ’ వంటి విమర్శ గ్రంథాల్లో అంబేద్కరిజాన్ని తెలుగు దళిత కవిత్వానికి తాత్విక భూమికగా విశ్లేషించారు. ‘కవిత్వం – చర్చనీయాంశాలు’ (2021) వరుసగా రెండేళ్లు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తుది జాబితాలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాహిత్య పురస్కారం (2024), రెండు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలు, మహాకవి గుర్రం జాషువా పురస్కారం సహా ఎన్నో గౌరవాలు అందుకున్నారు.